ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. టీ20 ప్రపంచకప్ నుంచి జేసన్ రాయ్ అవుట్!
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకు స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ ఈ టోర్నీకి దూరమయ్యాడు. సౌతాఫ్రికా మ్యాచ్‌లో పిక్క గాయంతో

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకు స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ ఈ టోర్నీకి దూరమయ్యాడు. సౌతాఫ్రికా మ్యాచ్‌లో పిక్క గాయంతో బాధపడిన రాయ్.. ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత అతను ఆడతాడా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఈ విశ్వకప్‌లో అందుబాటులో ఉండబోడని ఇంగ్లండ్ జట్టు ప్రకటించింది. అతని స్థానంలో జేమ్స్ విన్స్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ కోసం రిజర్వ్ ఆటగాడిగా విన్స్ జట్టుతో ఉన్నాడు. ఇంగ్లండ్ జట్టు సెమీఫైన్లో న్యూజిల్యాండ్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనింగ్ బాధ్యతలు ఎవరు మోస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అద్భుత ఫామ్‌లో ఉన్న బట్లర్‌తో కలిసి విన్స్ ఓపెనింగ్ చేయించాలా? లేక లివింగ్స్టన్, బెయిర్స్టోలలో ఒకరిని ఓపెనింగ్ చేయడానికి పంపాలా? అని ఇంగ్లండ్ జట్టు మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

