పొట్టి ప్రపంచకప్‌లో అంచనాలు తలకిందులు చేసే మ్యాచులు చాలానే జరుగుతుంటాయి. వాటిలో బుధవారం జరిగిన ఇంగ్లండ్, ఐర్లాండ్ మ్యాచ్ కూడా ఒకటి. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఐర్లాండ్.. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది.
ఈ మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. దీనిపై భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా చురకలేశాడు. ‘భారీ విజయం సాధించిన ఐర్లాండ్‌కు శుభాకాంక్షలు. అయితే ఇలా డీఎల్ఎస్ విధానంలో గెలవడాన్ని కూడా స్పిరిట్ ఆఫ్ ది గేమ్ కాదంటూ ఇంగ్లండ్ గొడవ చెయ్యదనే ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు.
కొన్ని రోజుల క్రితం భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ప్లేయర్‌ను దీప్తి శర్మ అవుట్ చేసింది. ఇది ఐసీసీ రూల్స్‌లో రనౌట్‌గా ఉన్నప్పటికీ ‘స్పిరిట్ ఆఫ్ ది గేమ్’కు ఇది ప్రతికూలత అంటూ ఇంగ్లండ్ ఆటగాళ్లు పెద్ద గొడవ చేశారు. దీన్ని ఉద్దేశించే మిశ్రా ట్వీట్ చేశాడు. ఇప్పుడిది నెట్టింట వైరల్‌గా మారింది.
Congratulations @cricketireland on a massive victory. Hope England doesn’t say winning through DLS isn’t in the spirit of the game. 😄 #EngvsIRE pic.twitter.com/0S4L5f1ZTi
— Amit Mishra (@MishiAmit) October 26, 2022