T20 hitters : పొట్టి క్రికెట్… గత కొంతకాలంగా ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్ వంటి హిట్టర్లు పవర్ హిట్టింగ్తో అకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఈ ఫార్మాట్లో వరుస సెంచరీలు చేస్తూ రికార్డులు తిరగరాస్తున్నారు. మామూలుగా అయితే.. ఈ ఫార్మాట్లో ఓపెనర్లకే సెంచరీ చేసే అవకాశం ఉంటుంది. అలాంటిది కొందరు ఆటగాళ్లు మిడిలార్డర్లో వచ్చి కూడా శతకం బాదారు. టీమిండియా టీ20 సంచలనం సూర్యకుమార్ అత్యధిక సెంచరీలో ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఈ వరల్డ్ నంబర్ 1 ప్లేయర్ ఖాతాలో మూడు టీ20 సెంచరీలు ఉన్నాయి. భారత ఆటగాడు కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రౌసో, డేవిడ్ మిల్లర్, న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిఫ్స్ తలా రెండు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు.
వరల్డ్ నంబర్ 1 అయిన సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్‌పై తొలి టీ20 సెంచరీ సాధించాడు. పోయిన ఏడాది నవంబర్‌లో న్యూజిలాండ్ సిరీస్‌లో రెండో శతకం బాదాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఆఖరి టీ20లో మూడో సెంచరీ చేశాడు. 2016లో టీ20 జట్టులో చోటు సంపాదించిన కేఎల్ అదే ఏడాది తొలి శతకం కొట్టాడు. వెస్టిండీస్ పర్యటనలో లాడెర్‌హిల్ గ్రౌండ్లో రాహుల్ సెంచరీ (110)తో కదం తొక్కాడు. 2018లో ఇంగ్లండ్‌పై మాంచెస్టర్ స్టేడియంలో రెండో శతకం(101) సాధించాడు.
Suryakumar Yadav has most T20 International centuries among non-openers now 💪#SKY #SuryaKumarYadav #Cricket pic.twitter.com/FMf916C7rG
— Sportskeeda (@Sportskeeda) January 8, 2023