MI vs RCB : ఆర్సీబీ నిర్దేశించిన భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. టపటపా మూడు వికెట్లు పడడంతో ముంబై ఒత్తిడిలో కూరుకుపోయింది. బెంగళూరు స్పిన్నర్ సుయాశ్ శర్మ(2-47) ఒకే ఓవర్లో రియాన్ రికెల్టన్ (37), తిలక్ వర్మ(1)లను ఔట్ చేసి ముంబైకి షాకిచ్చాడు. ఆ కాసేపటికే డేంజరస్ సూర్యకుమార్ యాదవ్(33)ను కృనాల్ పాండ్యా వెనక్కి పంపాడు. ఊరిస్తూ వేసిన బంతిని సిక్సర్ కొట్టాలనుకున్న సూర్య బౌండరీ లైన్ వద్ద రసిక్ దార్ చేతికి చిక్కాడు.
వాంఖడేలో ఆర్సీబీని భారీ స్కోర్ కొట్టనిచ్చిన ముంబై ఇండియన్స్ ఛేదనలో తడబడుతోంది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్(37), రోహిత్ శర్మ(19)లు శుభారంభమిచ్చినా.. తొడకండరాల నొప్పితో రోహిత్ మైదానం వీడాడు. కాసేపటికే సుయాశ్ శర్మ(2-47) ముంబైకి బిగ్ షాకిస్తూ రెండు వికెట్లు తీశాడు. 8వ ఓవర్లో అతడు రికెల్టన్, తిలక్ వర్మ(1)లను పెవిలియన్ పంపాడు.
Talk about an 𝙀𝙉𝙏𝙍𝘼𝙉𝘾𝙀! ⚡
Suyash Sharma with a double blow in his first over ✌️
Updates ▶️ https://t.co/q1MGJfD2d8#TATAIPL | #KhelBindaas | #MIvRCB | @RCBTweets pic.twitter.com/621CcSLzxt
— IndianPremierLeague (@IPL) April 12, 2026
బాధ్యతగా ఆడి ముంబైని గెలిపిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్(33)ను క్రీజులో కుదురుకోకముందే కృనాల్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. చూస్తుండగానే మూడు వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(34 నాటౌట్), ఇంప్యాక్ట్ సబ్ షెర్ఫానే రూథర్‌ఫోర్డ్(10 నాటౌట్)లు ముంబైని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఓవర్లకు స్కోర్.. 138-3.