ముంబై : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై జట్టును వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైని వదిలేసి అతను దేశవాళీ క్రికెట్లో గోవా జట్టు తరపున ఆడనున్నట్లు రూమర్స్ వ్యాపిస్తున్నాయి. ముంబై జట్టుకు చెందిన మరో క్రికెటర్ జైస్వాల్.. వచ్చే సీజన్ గోవా జట్టుకు ఆడనున్న విషయం తెలిసిందే. జైస్వాల్ తరహాలోనే సూర్యకుమార్ యాదవ్ కూడా వెళ్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలకు ముంబై క్రికెట్ సంఘం చెక్ పెట్టేసింది. ముంబై జట్టుకే ఆడేందుకు సూర్య కట్టుబడి ఉన్నట్లు ఎంసీఏ స్పష్టం చేసింది. సూర్యకుమార్ గురించి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న రూమర్స్ గురించి తెలుసు అని ఎంసీఏ చెప్పింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఎంసీఏ కార్యదర్శి అభయ్ హదాప్ పేర్కొన్నారు.
సూర్యకుమార్‌తో ఇవాళ ఉదయం ఎంసీఏ అధికారులు ఈ అంశం గురించి చర్చించారు. గోవాకు సూర్య వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు అని ఎంసీఏ అధికారులు కోరారు. ప్లేయర్లకు సపోర్టు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై జట్టుకు ఆడుతున్న సూర్యకుమార్ ఇవాళ అయోధ్య రామాలయాన్ని విజిట్ చేశారు.
Mumbai Indians’ players Suryakumar Yadav, Tilak Varma, Deepak Chahar, and Karn Sharma visited the Ayodhya Ram Mandir🛕 pic.twitter.com/6QO4vUvQFt
— Circle of Cricket (@circleofcricket) April 3, 2025
వ్యక్తిగత కారణాల వల్ల క్రికెటర్ జైస్వాల్.. ముంబై నుంచి గోవా జట్టుకు వెళ్తున్న విషయం తెలిసిందే. జైస్వాల్ చేసిన రిక్వెస్ట్‌ను ముంబై క్రికెట్ సంఘం వెంటనే ఆమోదించింది. దీంతో 2025-26 సీజన్ నుంచి జైస్వాల్ గోవా తరపున దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడు.