IND vs SA : జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న పొట్టి సిరీస్ డిసైడర్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(100 : 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. తన ట్రెడ్‌మార్క్ షాట్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ సాధించాడు. దాంతో, టీమిండియా 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పవర్ ప్లేలో రెండు పడిన దశలో.. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(60 : 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో జత కలిసిన సూర్య ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
Sensational SKY 😍
Fourth T20I century for the No.1⃣ ranked batter in the format 🔥
📝 #SAvIND: https://t.co/yFwB61tuYb pic.twitter.com/r2jdyUeicS
— ICC (@ICC) December 14, 2023
వాండరర్స్లోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ తీసుకుంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్() మూడు ఫోర్లు బాదాడు. అయితే.. కేశవ్ మహారాజ్ తన మొదటి ఓవర్లోనే వరుస బంతుల్లో డేంజరస్ గిల్, తిలక్ వర్మ(0)ను ఔట్ చేశాడు. 29 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో యశస్వీ.. సూర్య విలువైన భాగస్వామ్యం నెలకొప్పారు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 100 పరుగులు జోడించారు.
సూర్యకుమార్ యాదవ్(100), యశస్వీ జైస్వాల్(60)
క్రీజులోకి వచ్చాక కుదరుకోవడానికి టైమ్ తీసుకున్న సూర్య.. ఆ తర్వాత రెచ్చిపోయాడు. పెహ్లుక్వయో ఓవర్లో వరుసగా ఫోర్, సిక్సర్‌తో ఫిఫ్టీ సాధించాడు. అనంతరం సూర్య ఇన్నింగ్స్ టాప్ గేర్‌లో సాగింది. విలియమ్స్, బర్గర్‌ను టార్గెట్ చేసిన సూర్య సిక్సర్లతో హోరెత్తించాడు. దాంతో, భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. విలియమ్స్ వేసిన 19వ ఓవర్లో రెండు రన్స్ తీసిన సూర్య టీ20ల్లో నాలుగో సెంచరీ నమోదు చేశాడు.