ముంబై : ఆసియాకప్(Asia Cup)లో ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఆ టోర్నీకి శుభమన్ గిల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇవాళ ముంబైలో సమావేశం అయిన బీసీసీఐ సెలెక్టర్ల బృందం భారత జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది ప్లేయర్ల బృందాన్ని వెల్లడించారు. అయ్యర్, జైస్వాల్‌కు చోటు దక్కలేదు.
స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో కూడా శ్రేయాస్ అయ్యర్ పేరు లేదు. ఈ టోర్నీ కోసం అయిదుగురు రిజర్వ్ ప్లేయర్లను ప్రకటించారు. ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, జైస్వాల్, రియాన్ పరాగ్, ద్రువ్ జురెల్.. రిజర్వ్ లిస్టులో ఉన్నారు. అయితే ఆ జాబితాలో కూడా శ్రేయాస్ అయ్యర్ పేరు లేకపోవడం గమనార్హం.
సెప్టెంబర్ పదో తేదీన యూఏఈతో ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నది. దుబాయ్ వేదికగానే సెప్టెంబర్ 14వ తేదీన పాకిస్థాన్‌తో హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. ఇక 19వ తేదీన ఒమన్‌తో చివరి రౌండ్ మ్యాచ్ ఆడనున్నది.
భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్, గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.
🚨 #TeamIndia‘s squad for the #AsiaCup 2025 🔽
Surya Kumar Yadav (C), Shubman Gill (VC), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Shivam Dube, Axar Patel, Jitesh Sharma (WK), Jasprit Bumrah, Arshdeep Singh, Varun Chakaravarthy, Kuldeep Yadav, Sanju Samson (WK), Harshit Rana,…
— BCCI (@BCCI) August 19, 2025