న్యూఢిల్లీ: యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. కొత్త ‘మిస్టర్ 360’గా రూపాంతరం చెందాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. టీ20 ప్రపంచకప్లో అతడు ధాటిగా ఆడకపోతే.. టీమ్ఇండియా భారీ స్కోర్లు చేసేందుకు ఇబ్బంది పడుతుందని సన్నీ అన్నాడు. ఆసీస్ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో సూర్యకుమార్ చెలరేగిపోతున్న నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘సూర్య కొత్త ‘మిస్టర్ 360’. జింబాబ్వేతో పోరులో అతడు మైదానం నలువైపులా షాట్లు ఆడాడు. బౌలర్లను తికమక పెడుతూ.. చక్కటి షాట్లతో పరుగులు రాబట్టాడు’అని అన్నాడు.