IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఇంకా బోణీ కొట్టలేదు. ఐదుసార్లు ట్రోఫీ కొల్లగొట్టిన ముంబై గెలుపు బాట పడితే చూడాలని కోట్లాది మంది అనుకుంటున్నారు. హ్యాట్రిక్ ఓటములతో అట్టడుగున నిలిచిన హార్దిక్ పాండ్యా సేనకు గుడ్‌న్యూస్. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) వచ్చేస్తున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ నుంచి కోలుకున్న సూర్య ఫిట్నెస్ సాధించాడు.
దాంతో, అతడికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. ‘సూర్య 100 శాతం ఫిట్‌గా మారాడు. అతడు మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ముంబై తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన సూర్య.. త్వరలోనే జట్టుతో కలువనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 7న జరిగే మ్యాచ్‌లో ఈ టీ20 చిచ్చరపిడుగు బరిలోకి దిగే చాన్స్ ఉంది.