IND vs AFG : కరీబియన్ గడ్డపై సూపర్ 8 తొలి మ్యాచ్‌లో భారత జట్టు(Team India) భారీ స్కోర్ బాదింది. వరల్డ్ నంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(53) మెరుపు హాఫ్ సెంచరీ కొట్టగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(32) ఉతికేశాడు. స్లో పిచ్‌పై వీళ్ల విధ్వంసంతో టీమిండియాకు కొండంత స్కోర్ అందించారు. టాపార్డర్ తడబడినా మేమున్నామంటూ ఇద్దరూ అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఎడాపెడా బౌండరీలతో చెలరేగి జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో, టీమిండియా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో టాస్ గెలిచిన టీమిండియాకు ఆదిలోనే ఫజల్ హక్ ఫారూఖీ తన రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ(8)ను బోల్తా కొట్టించాడు. 11 పరుగుల వద్ద తొలి వికెట్ పడినా రిషభ్ పంత్(20) ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. నబీ వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో ఈ డాషింగ్ హిట్టర్ మూడు ఫోర్లు సంధించాడు. రెండో వికెట్‌కు కోహ్లీ(24)తో కలిసి 43 రన్స్ జోడించిన పంత్‌ను రషీద్ ఖాన్(3/36) ఎల్బీగా వెనక్కి పంపాడు.
Suryakumar Yadav plays his part very well for India – is 181/8 a winning total? #AFGvIND #T20WorldCup
👉 https://t.co/gf52x20kRh pic.twitter.com/rnoKTEYhJZ
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2024
ఆ కాసేపటికే ఊరించే బంతితో కోహ్లీని బౌండరీ వద్ద నబీకి చిక్కేలా చేశాడు. అంతే.. రన్‌రేట్ బాగానే ఉన్నా 62 పరుగులకే మూడు వెకెట్లు పడ్డాయి. ఆ దశలో సూర్యకుమార్ యాదవ్(53).. శివం దూబే(10)తో జట్టు స్కోర్ బోర్డును ఉరికించాడు. టచ్‌లో ఉన్నట్టే కనిపించిన దూబేను అఫ్గన్ సారథి స్లో బంతితో ఎల్బీగా వెనక్కి పంపాడు.
అవతలి ఎండ్‌లో నిలబడే వాళ్లు కరువైనా సూర్య తన జోరు తగ్గించలేదు. రషీద్‌తో సహా అజ్మతుల్లా ఓమర్జాయ్, నూర్ అహ్మద్‌లను ఉతికేస్తూ.. జట్టు స్కోర్ 100 దాటించాడు. మిస్టర్ 360కి జత కలిసిన వైప్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(32) ఓపికగా ఆడాడు. ఫారుఖీ ఓవర్లో వరుసగా 6, 4తో సూర్య అర్ద సెంచరీ సాధించాడు. కానీ, ఆ తర్వాత బంతికే ఔటయ్యాడు.
Hardik survives an lbw shout on review, but is caught a ball later #AFGvIND #T20WorldCup
👉 https://t.co/gf52x20kRh pic.twitter.com/TC6COxXhl0
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2024
అంతే.. ఇక నా వంతు అన్నట్టు పాండ్యా బ్యాట్ ఝులిపించాడు. నవీన్ ఉల్ హక్ వేసిన 18వ ఓవర్లో భారీ సిక్సర్ బాది ఆఖరి బంతికి మరో ఆరేయబోయి బౌండరీ వద్ద దొరికిపోయాడు. ఇక 20వ ఓవర్లో.. అక్షర్ పటేల్ (12 ) రెండు బౌండరీలో జట్టు స్కోర్ 180 దాటింది. అఖరి బంతికి అక్షర్ రనౌట్ కావడంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 181 రన్స్ చేసింది.