లండన్: ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్‌షిప్(County Championship) డివిజన్ వన్ క్రికెట్లో కొత్త రికార్డు నమోదు అయ్యింది. సర్రే జట్టు ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 820 రన్స్ చేసింది. ఆ జట్టు 800 స్కోర్ దాటడం .. కౌంటీ టోర్నీలో ఇది రెండోసారి. దీంతో 126 ఏళ్ల క్రితం నమోదు అయిన రికార్డును సర్రే జట్టు బ్రేక్ చేసింది. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్రే 9 వికెట్లు కోల్పోయి 820 రన్స్ చేసింది. సోమవారం ఈ కొత్త రికార్డు నమోదు అయ్యింది. 1899లో అంటే 126 ఏళ్ల క్రితం కౌంటీ క్రికెట్లో సర్రే జట్టు 811 రన్స్ స్కోర్ చేసింది.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో సర్రే బ్యాటర్ డామ్ సిబ్లే అత్యధికంగా ట్రిపుల్ సెంచరీ చేశాడు. సిబ్లే 305 రన్స్ స్కోర్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు, 29 ఫోర్లు ఉన్నాయి. రెండో రోజు మూడు వికెట్లకు 407 రన్స్ వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన సర్రే జట్టులో మరో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో చెలరేగాడు. డాన్ లారెన్స్ 178, విల్ జాక్స్ 119, సామ్ కర్రన్ 108 రన్స్ చేశారు. కౌంటీ టోర్నీ చరిత్రలో రెండు సార్లు 800 స్కోరు దాటిన జట్టుగా సర్రే రికార్డు క్రియేట్ చేసింది.
కౌంటీ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా యార్క్‌షైర్ జట్టు 887 రన్స్ స్కోర్ చేసింది.1896లో బర్మింగ్‌హామ్‌లో ఆ రికార్డును నెలకొల్పింది.