న్యూఢిల్లీ: నిషేధిత బెట్టింగ్ యాప్స్ కేసులో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చిక్కుల్లో పడ్డాడు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో బుధవారం ఈడీ విచారణకు రైనా హాజరయ్యాడు. మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈ కేసులో రైనాపై ఈడీ అధికారులు పలు కీలక ప్రశ్నలు సంధించారు.
ఎలాంటి ఒప్పందాలు కుదర్చుకున్నారన్న దానిపై ఈ మాజీ క్రికెటర్ నుంచి ఈడీ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది.