హైదరాబాద్, ఆట ప్రతినిధి: కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌తో పాటు చైనాలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీకి తెలంగాణ యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ ఎంపికైంది. షిమ్కెంట్లో ప్రస్తుతం జరుగుతున్న ఏషియన్ షూటింగ్ టోర్నీలో సురభి మహిళల 50మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో బరిలోకి దిగనుంది.
మరోవైపు చైనా ఆతిథ్యమిచ్చే ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లోనూ సురభి 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న సురభి పతకాలు కొల్లగొడుతున్నది.