IPL 2025 : అత్యధిక సోర్తో ఐపీఎల్ 18వ సీజన్లో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా రెండు మ్యాచల్లో ఓడి 8వ స్థానంలో నిలిచిన కమిన్స్ సేన.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో తలపడుతోంది. అది కూడా వాళ్ల కంచుకోట ఈడెన్ గార్డెన్స్‌లో. టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ ఛేజింగ్‌కు మొగ్గు చూపాడు. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్(Rinku Singh)కు ఇది 50వ ఐపీఎల్ మ్యాచ్. ఈ ప్రత్యేక సందర్భాన్ని పునస్కరించుకొని.. 50వ నంబర్‌తో ఉన్న జెర్సీతో రింకూ బరిలోకి దిగనున్నాడు.
హిట్టర్లతో కూడిన కోల్‌కతాను తక్కువకే కట్టడి చేస్తారా? లేదంటే భారీ స్కోర్ సమర్పించుకుంటారా? అనేది మరికాసేపట్లో తేలిపోనుంది. ఐపీఎల్ ప్రతి సీజన్లో హైదరాబాద్‌పై కోల్‌కతా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఇప్పటివరకూ ఇరుజట్లు 19సార్లు ఎదురుపడగా.. సన్‌రైజర్స్ కేవలం 9 మ్యాచుల్లో గెలిచిందంతే. అందుకే.. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు గెలుపుపై ధీమాతో ఉండగా.. ట్రావిస్ హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్‌లను నమ్ముకున్న ఆరెంజ్ ఆర్మీ 17వ సీజన్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షత్ పటేల్, మహ్మద్ సిరాజ్, జీషన్ అన్సారీ.
కోల్‌కతా తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మోయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
🚨 Toss 🚨@SunRisers won the toss and elected to bowl against @KKRiders in Match 1⃣5⃣
Updates ▶️ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH pic.twitter.com/zO92b2ImLj
— IndianPremierLeague (@IPL) April 3, 2025