చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన ముంబై సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్..ఛేదనలో చేతులెత్తేయడంతో రోహిత్ మొదట బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపినట్లు తెలుస్తో్ంది.రైజర్స్ తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేసినట్లు ఆ జట్టు కెప్టెన్ వార్నర్ తెలిపాడు. వృద్ధిమాన్ సాహా, జేసన్ హోల్డర్, శాబాజ్ నదీం, టీ నటరాజన్ స్థానంలో విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, ముజీబ్ రెహమాన్, ఖలీల్ అహ్మద్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు.
ఒక సీజన్లో సన్‌రైజర్స్ తొలి మూడు మ్యాచ్‌లను ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ, ఈసారి ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయంపాలైంది. హైదరాబాద్ మినహా అన్ని జట్లు కనీసం ఒక్క గేమ్‌లో గెలిచి పాయింట్ల ఖాతా తెరిచాయి. పటిష్ట ముంబైతో పోరులో ఎలాగైన విజయం సాధించి గెలుపు బాటపట్టాలని వార్నర్‌సేన పట్టుదలతో ఉంది. సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడి, సెకండ్ మ్యాచ్‌లో గెలిచిన ముంబై అదే జోరు కొనసాగించాలనుకుంటోంది.
A look at the Playing XI for #MIvSRH
— IndianPremierLeague (@IPL) April 17, 2021
For #MI – Adam Milne is all set to make his debut.#SRH with four changes – Mujeeb Ur Rahman, Khaleel Ahmed, Abhishek Sharma and Virat Singh come in.
Follow the game here – https://t.co/oUdPyW0t8T #VIVOIPL https://t.co/R6CTQzCKnT pic.twitter.com/E8T54xGmSR
Match 9. Mumbai Indians XI: R Sharma, Q de Kock, S Yadav, I Kishan, H Pandya, K Pollard, K Pandya, A Milne, R Chahar, J Bumrah, T Boult https://t.co/ptYFR2P5Iz #MIvSRH #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 17, 2021
Match 9. Sunrisers Hyderabad XI: D Warner, J Bairstow, M Pandey, V Singh, A Samad, V Shankar, A Sharma, R Khan, B Kumar, M Ur Rahman, K Ahmed https://t.co/ptYFR2P5Iz #MIvSRH #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 17, 2021