ముంబై: గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సునీల్ గవాస్కర్ ఆర్థిక సాయం అందించనున్నారు. గవాస్కర్ ‘చాంప్స్ ఫౌండేషన్’ తరఫున కాంబ్లీకి నెలకు రూ. 30 వేలతో పాటు వార్షిక వైద్య సాయం కింద ఏడాదికి మరో రూ. 30 వేలు ఇవ్వనున్నారు.
నిరుడు డిసెంబర్లో మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడ్డ కాంబ్లీ కొన్నిరోజులు దవాఖానాలోనే గడిపాడు. నడవడానికీ కష్టంగా ఉన్నా కొంతకాలం క్రితం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిర్వహించిన వాంఖడే 50 సంవత్సరాల వేడుకకు కాంబ్లీ రాగా ఈ కార్యక్రమానికి గవాస్కర్ సైతం హాజరయ్యాడు.