ముంబై: దేశవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీ నుంచి స్టార్ క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్కోహ్లీకి మినహాయింపు ఇవ్వడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం మీడియాతో సన్నీ మాట్లాడుతూ ‘సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ మొదలవుతున్నది. ఇందులో పలువురు టీమ్ఇండియా ప్లేయర్లు ఉన్నారు. కానీ సీనియర్లు రోహిత్, కోహ్లీ, అశ్విన్, బుమ్రాకు విశ్రాంతినిస్తూ దేశవాళీలో రాణిస్తున్న ప్లేయర్లకు అవకాశమిచ్చారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడాల్సిన రోహిత్, కోహ్లీకి విశ్రాంతినివ్వడం సరైంది కాదు. జూన్ 28న టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడిన వీరిద్దరు, శ్రీలంకతో మూడు వన్డేలు ఆడారు. ఆ తర్వాత 40 రోజుల పాటు పూర్తి ఆటకు దూరంగా ఉండి..బంగ్లాతో సిరీస్ ఆడనున్నారు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా టెస్టులు ఆడటం మంచి పద్ధతి కాదు’ అని అన్నాడు. రానున్న రోజుల్లో వరుస సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని స్పీడ్‌స్టర్ బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని అర్థం చేసుకోవచ్చని సన్నీ పేర్కొన్నాడు.