Sunil Gavaskar : ఓవల్ టెస్టులో భారత జట్టు చరిత్రాత్మక విజయంతో సిరీస్ కాపాడుకుంది. ఐదో రోజు సిరాజ్ మూడు వికెట్లతో టీమిండియాకు సూపర్ విక్టరీ అందించిన క్షణం మైదానంలోని ప్రేక్షకులే కాదు.. భారత అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అయితే గట్టిగా ఆరుస్తూ విజయాన్ని ఎంజాయ్ చేశాడు. చివరి బ్యాటర్ అట్కిన్సన్ను సిరాజ్ బౌల్డ్ చేయగానే సహచరులు హర్ష భోగ్లే, ఛతేశ్వర్ పూజారాలతో కలిసి చిరస్మరణీయ విజయాన్ని తనివితీరా ఆస్వాదించాడీ లెజెండ్. అయితే.. ఈ మ్యాచ్ కోసం తాను లక్కీ జాకెట్ ధరించానని సన్నీ తెలిపాడు. ఇంతకూ ఆ జాకెట్ తనకు లక్కీ ఎలా అయిందో తెలుసా..?
ఓవల్ టెస్టు మూడోరోజు గవాస్కర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో మాట్లాడుతూ తన లక్కీ జాకెట్ గురించి వివరించాడు. ‘రేపు నేను నా లక్కీ జాకెట్ వేసుకొని వస్తాను. ఆ జాకెట్‌ను ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్టులో వేసుకున్నా. ఈసారి మీ కోసం ఆ జాకెట్‌తో వస్తాను. ఆల్ ది బెస్ట్. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి’ అని గిల్‌తో తాను చెప్పినట్టు సన్నీ తెలిపాడు. అయితే.. వర్షం కారణంగా నాలుగో రోజు ముగియాల్సిన మ్యాచ్ ఐదో రోజుకు వాయిదా పడింది. సో.. గవాస్కర్ అదే జాకెట్‌తో సోమవారం కామెంటరీ బాక్స్‌లో అడుగుపెట్టాడు.
A win carved in 𝘨𝘳𝘪𝘵. A moment owned by 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳 ✨
Scenes from the commentary box as India do the improbable 🎙️#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/nYwGOn5jDx
— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025
‘సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్‌లకు నేను ఈ జాకెట్ ధరిస్తాను. ఆస్ట్రేలియాలో గబ్బా టెస్టులో ఇదే జాకెట్‌తో కామెంటరీ చేశాను. అప్పుడు భారత్ చిరస్మరణీయ విక్టరీ సాధించింది. ఇప్పుడు ఓవల్ టెస్టులో టీమిండియా గెలవాలని మళ్లీ నేను అదృష్టంగా భావించే జాకెట్ వేసుకున్నాను. ఇంకేముంది భారత్ అద్భుత విజయంతో సిరీస్ సమం చేసింది’ అని గవాస్కర్ సంతోషంగా వెల్లడించాడు.
మాంచెస్టర్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా ఓవల్‌లో గట్టిగా పోరాడింది. 374 పరుగుల ఛేదనలో ప్రత్యర్థి పైచేయి సాధించినా.. మ్యాచ్‌పై ఆశలు తగ్గుతున్నా బౌలర్లు గొప్పగా రాణించారు. ముఖ్యంగా సిరాజ్ ఐదో రోజు తొలి సెషన్లో మూడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో.. చేతిలో నాలుగు వికెట్లు ఉండి కూడా 35 రన్స్ కొట్టలేక సిరీస్ పంచుకుంది ఆతిథ్య జట్టు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఓవల్ టెస్టులో గిల్ సేన అపూర్వ విజయం భారత క్రికెట్ చరిత్రలో కలకాలం నిలిచిపోనుంది.