మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 16, 2021 , 17:07:44

ఆ షాట్ ఏంటి?.. రోహిత్‌పై గావస్కర్ ఫైర్‌

ఆ షాట్ ఏంటి?.. రోహిత్‌పై గావస్కర్ ఫైర్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఆఖరిదైన నాలుగో టెస్టులో  టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(44) ఔటైన విధానంపై భారత దిగ్గజం క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో  హిట్‌మ్యాన్‌ రోహిత్‌ ఆడిన షాట్‌ బాధ్యతారహితమైనదని గావస్కర్‌  విమర్శించారు.   రోహిత్‌ ఔటైన తర్వాత  లైవ్‌లో గవాస్కర్ మాట్లాడుతూ.. సీనియర్ బ్యాట్స్‌మన్‌  రోహిత్ శర్మ నుంచి  బాధ్యతారహితమైన షాట్ అంటూ  అసంతృప్తి వ్యక్తం చేశారు. 

'ఎందుకు? ఎందుకు? ఎందుకు? అది ఊహించని షాట్.  అదొక బాధ్యతారహితమైన షాట్.  లాంగాన్‌లో ఒకరు, స్వ్కేర్‌ లెగ్‌లో మరొక  ఫీల్డర్‌  ఉన్నాడు. అంతకముందే ఎదుర్కొన్న కొన్ని బంతులను  బౌండరీలుగా తరలించావు.  తర్వాత ఎందుకు ఆ షాట్​ ఆడావు? నువ్వొక సీనియర్‌ ఆటగాడివి. ఆ షాట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని' గావస్కర్‌ పేర్కొన్నారు.  ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ వేసిన 20వ ఓవర్లో మిచెల్‌ స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ ఔటయ్యాడు. 

ఇవి కూడా చదవండి:

కోహ్లీ ఉంటే కథ వేరేలా ఉండేది..!

రోహిత్ శ‌ర్మ ఔట్‌.. ఇండియా 62/2
హార్ధిక్ పాండ్యా తండ్రి క‌న్నుమూత

VIDEOS

logo