Sunil Chhetri : భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న అతను మొదటిసారి తండ్రయ్యాడు. అతడి భార్య సోనమ్ భట్టాచార్య(Sonam Bhattacharya) ఈరోజు పండంటి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, కొడుకు ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్లు, చెత్రీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. సోనమ్‌కు డెంగీ జ్వరం(Dengue Fever) బారిన పడింది. దాంతో, పుట్టబోయే బిడ్డ గురించి అందరూ ఆందోళన చెందారు. అయితే.. వాళ్లు భయపడినట్టు ఏం జరగలేదు.
సునీల్ ఛెత్రీ తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని మైదానంలోనే అందరితో పంచుకున్నాడు. అవును.. జూన్ నెలలో జరిగిన ఇంటర్కాంటినెంటల్ కప్(Intercontinental Cup 2023)లో సునీల్ చెత్రీ గోల్ కొట్టాడు. అనంతరం ఆ బంతిని తన టీ షర్ట్ లోపల పెట్టుకొని భార్య సోనమ్ వైపు చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. స్టాండ్స్‌లో ఉన్న ఆమె ఈ క్షణం ఎంతో సంతోషించింది. ‘నేను, నా భార్య త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాం.
.@chetrisunil11‘s left footed finish takes the #BlueTigers 🐯 to the #HeroIntercontinentalCup 🏆 FINAL 💙😍#VANIND ⚔️ #IndianFootball ⚽️ pic.twitter.com/1n081IsM4I
— Indian Football Team (@IndianFootball) June 12, 2023
ఈ విషయాన్ని ఈ విధంగా అందరితో చెప్పాలని ఆమె అనుకుంది. అందుకనే గోల్ కొట్టాక బంతిని నా పొట్ట మీద పెట్టుకున్నా. ఇదంతా ఆమె కోసం. నా బిడ్డ కోసం. ఇలా చేయడం ద్వారా అందరి ఆశీర్వాదం మాకు లభిస్తుందని నా నమ్మకం’ అని మ్యాచ్ అనంతరం ఛెత్రీ వెల్లడించాడు.
సునీల్ ఛెత్రీ
ఈ సీజన్లో ఛెత్రీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. స్వదేశంలో జరిగిన శాఫ్ చాంపియన్‌షిప్, ఇంటర్కాంటినెంటల్ పోటీల్లో గోల్స్‌తో హోరెత్తించాడు. దాంతో, ఈ రెండు పోటీల్లో భారత్ చాంపియన్‌గా అవతరించింది. ప్రస్తుతం చెత్రీ థాయ్‌లాండ్‌లో జరుగనున్న కింగ్స్ కప్(Kings Cup 2023)పై దృష్టి పెట్టాడు. ఈ ఏడాది ఆసియా కప్(AFC Asian Cup) ఉన్నందుకు ఈ టోర్నీ భారత జట్టుకు కీలకం కానుంది.