Prithvi Shaw | కౌంటీలపై పృథ్వీ షా మోజు.. వచ్చే సీజన్లో మళ్లీ అదే జట్టుకు ఆడతాడట..!
Prithvi Shaw : భారత యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) కౌంటీ క్రికెట్‌పై మనసు పడ్డట్టు ఉన్నాడు. వన్డే కప్(One Day Cup)లో ఫామ్ అందుకున్న షా తాజాగా ఇంగ్లండ్ కౌంటీ జట్టుకు శుభవార్త చెప్పాడు. వచ్చే ఏడాది కౌంటీ సీజన్లో నార్తంప్టన్‌షైర్ (Northamptonshire) జట్టు తరఫునే బరిలోకి దిగుతానని చెప్పాడు. అంతేకాదు వన్డే కప్ పోటీలకు కూడా అందుబాటులో ఉంటానని...
Prithvi Shaw : భారత యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) కౌంటీ క్రికెట్‌పై మనసు పడ్డట్టు ఉన్నాడు. వన్డే కప్(One Day Cup)లో ఫామ్ అందుకున్న షా తాజాగా ఇంగ్లండ్ కౌంటీ జట్టుకు శుభవార్త చెప్పాడు. వచ్చే ఏడాది కౌంటీ సీజన్లో నార్తంప్టన్‌షైర్ (Northamptonshire) జట్టు తరఫునే బరిలోకి దిగుతానని చెప్పాడు. అంతేకాదు వన్డే కప్ పోటీలకు కూడా అందుబాటులో ఉంటానని తెలిపాడు. అయితే.. ఇతర దేశాల నుంచి ఆఫర్లు వచ్చినా కూడా తాను నార్తంప్టన్షైర్కే మాట ఇస్తున్నాని షా వెల్లడించాడు.
‘జట్టును గెలిపించడమే నా లక్ష్యం. కానీ, గాయం కారణంగా ఈ ఏడాది టోర్నీ మధ్యలోనే జట్టును వీడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. వచ్చే ఏడాది కౌంటీ, వన్డే కప్‌లో తమ జట్టు తరఫున ఆడాల్సిందిగా కొన్ని దేశాలు కోరాయి. అయితే.. నార్తంప్టన్‌షైర్ జట్టుతో నేను సాధించాల్సింది చాలా ఉంది. ఫామ్‌లో లేని నాకు వాళ్లు ఈ ఏడాది అవకాశం ఇచ్చారు. అందుకని వచ్చే సీజన్లో వాళ్లతోనే ఉంటాను’ అని షా వెల్లడించాడు.
పృథ్వీ షా

వన్డే కప్‌లో నార్తంప్టన్‌షైర్(Northamptonshire) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. దంచికొట్టిన షా గాయపడ్డాడు. డుర్హం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా షా మోకాలికి గాయం అయింది. స్కానింగ్‌లు తీశాక అనుకున్నదానికంటే గాయం తీవ్రత ఎక్కువ ఉందని తెలిసింది. దాంతో ఈ స్టార్ బ్యాటర్ టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. ఈమధ్యే సర్జరీ చేయించుకున్న షా రెండు దేశవాళీ ట్రోఫీలకు దూరం అయ్యాడు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy), సయ్యద్ ముస్తాక్ అలీ(syed mushtaq ali trophy).. ఈ రెండు ట్రోఫీల్లో ఈ డాషింగ్ ఓపెనర్ ఆడడం లేదు.
ఢిల్లీని ముంచిన షా
ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టును నట్టేట ముంచాడు. ఈ విధ్వంసక ఓపెనర్ భారీ స్కోర్లు చేయకపోవడంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దెబ్బతిన్నాయి.
పదహారో సీజన్ ఐపీఎల్లో విఫలమైన పృథ్వీ షా

అంతేకాదు ఐపీఎల్లో చెత్త ప్రదర్శన కారణంగా వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టారు. మళ్లీ భారత జట్టులోకి రావాలంటే పరుగులు సాధించడం ఒక్కటే మార్గమని షా అనుకున్నాడు. ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే కప్‌తో చితక్కొట్టాడు. సొమర్సెట్ (Somerset) జట్టుపై డబుల్ సెంచరీ (244), డుర్హం జట్టు(Durham)పై 125 నాటౌట్‌తో చెలరేగాడు.
ఇవి కూడా చదవండి
BCCI Digital Rights | బీసీసీఐ డిజిటల్, టీవీ హక్కులు వైకోమ్ 18 చేతికి.. ఎంత ధరకో తెలుసా..?
Tanveer Sangha | అదృష్టం అంటే ఇతడిదే.. అరంగేట్రంలోనే ‘గెలుపు గుర్రం’ అనిపించుకున్నాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

