Sunil Chhetri : భారత ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. ఇరవై ఏండ్లుగా టీమిండియా విజయాల్లో భాగమైన సునీల్ ఛెత్రీ (Sunil Chhetri) దేశం తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. కోల్‌కతాలో కువైట్(Kuwait)తో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్‌లో ఈ మిడ్‌ఫీల్డర్ చివరిసారిగా బరిలోకి దిగాడు. అయితే…విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలనున్న అతడి కల నిజమవ్వలేదు. హోరాహోరీగా సాగిన మ్యాచ్ కాస్త డ్రా అయింది.
అంతే.. సాల్ట్ లేక్ స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. దేశం తరఫున అత్యధిక గోల్స్(94) కొట్టిన ఛెత్రీ బ్లూ జెర్సీతో చివరి మ్యాచ్ ఆడేయడంతో భావోద్వేగానికి లోనయ్యాడు. అభిమానుల మద్దతు, ప్రేమను మిస్ అవుతున్నానంటూ చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
A very emotional moment for Sunil Chhetri. He couldn’t hold his tears as the team members give him guard of honor. pic.twitter.com/wt2qjuDs9A
— Himanshu Pareek (@Sports_Himanshu) June 6, 2024
కోల్‌కతా వేదికగా భారత్, కువైట్‌లు ‘నువ్వా నేనా’ అన్నట్టు తలపడ్డాయి. దాంతో, తొలి అర్ధ భాగంలో ఒక్కసారి కూడా బంతి గోల్ పోస్ట్‌లోకి వెళ్లలేదు. ఇక రెండో భాగంలోనూ ఇరు జట్ల ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. దాంతో, మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఛెత్రీకి ప్రేక్షకులు నీరాజనం పలికారు.
Thank You Sunil Chhetri 🫡 pic.twitter.com/TJtSdZEH6R
— Pushkar (@musafir_hu_yar) June 6, 2024