ముంబై: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెండ్లిపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ ప్రేమ వ్యవహారానికి త్వరలోనే ఫుల్స్టాప్ పడనుందని చెప్పారు. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, కేఎల్ రాహుల్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. గతకొంత కాలంగా ఈ జంట తొందర్లోనే పెళ్లిపీటలెక్కే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీనిపై సునీల్ శెట్టి స్పందించారు. పిల్లలు కోరుకున్నట్లు త్వరలోనే వివాహం జరిపిస్తామని చెప్పారు. అయితే పెండ్లనేది ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదని ట్విస్ట్ ఇచ్చారు.
కేఎల్ రాహుల్ రానున్న రోజుల్లో ఏషియా కప్, ప్రపంచ కప్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టూర్లో భారత్ తరఫున ఆడనున్నానుడే. ఈ బిజీ షెడ్యూల్లో అతనికి కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే ఖాళీ ఉన్నది. రెండు రోజుల్లోనే పెండ్లి చేయడమంటే మాటలు కాదని స్పష్టం చేశారు. సమయం దొరికినప్పుడు పెండ్లి చేసుకుంటారని చెప్పారు. విషయం మీకు ముందే చెబుతామని మీడియానుద్దేశించి అన్నారు.