లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి భారత యువ ప్లేయర్ సుమిత్ నాగల్ నిష్ర్కమించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాగల్ 2-6, 6-4, 6-2తో గులియో జెపెరీ(ఇటలీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. తన(294) కంటే ఎక్కువ ర్యాంక్‌లో ఉన్న గులియో(353)కు నాగల్ దీటైన పోటీనివ్వలేకపోయాడు.
2-6తో తొలి సెట్‌ను చేజార్చుకున్న నాగల్..రెండో సెట్లో గెలిచి పోటీలోకి వచ్చాడు. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో వరుస గేముల్ను కోల్పోయిన ఈ యువ ప్లేయర్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. దీంతో సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసినట్లయ్యింది. మరోవైపు డబుల్స్‌లో రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ.. భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు.