Paralympics | ఢిల్లీ: ఆగస్టు మాసాంతం నుంచి మొదలుకాబోయే పారాలింపిక్స్‌లో ప్రారంభ వేడుకలకు భారత్ నుంచి పతాకధారులుగా సుమిత్ అంతిల్, భాగ్యశ్రీ జాదవ్ ఎంపికయ్యారు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ ఇద్దరూ ఆరంభోత్సవ వేడుకల్లో పతాకధారులుగా వ్యవహరిస్తారని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) చీఫ్ దేవేంద్ర ఝఝారియా ఓ ప్రకటనలో తెలిపారు.
హర్యానాకు చెందిన సుమిత్ టోక్యో పారాలింపిక్స్‌లో ఎఫ్64 జావెలిన్ త్రో ఈవెంట్లో స్వర్ణం గెలిచాడు. మహారాష్ట్రకు చెందిన షాట్‌పుటర్ భాగ్యశ్రీ ఎఫ్34 కేటగిరీలో ఆసియా పారా గేమ్స్‌లో రజతం నెగ్గింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 దాకా పారిస్ వేదికగా జరుగబోయే ఈ క్రీడలకు భారత్ 84 మంది అథ్లెట్లతో బరిలోకి దిగుతోంది.