Unofficial Test | శతకంతో కదంతొక్కిన సుదర్శన్.. తొలి రోజే పట్టుబిగించిన భారత ఏ జట్టు..!
Unofficial Test : ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా నిలిచిన భారత ఏ జట్టు అనధికారిక టెస్టులోనూ చెలరేగుతోంది. శ్రీలంక ఏ బౌలర్లను ఎడాపెడా ఉతికేసిన ఓపెనర్ సాయి సుదర్శన్(132) శతకంతో రెచ్చియాడు.
Unofficial Test : ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా నిలిచిన భారత ఏ జట్టు అనధికారిక టెస్టులోనూ చెలరేగుతోంది. గాలే స్టేడియంలో శ్రీలంక ఏ బౌలర్లను ఎడాపెడా ఉతికేసిన ఓపెనర్ సాయి సుదర్శన్(132) శతకంతో రెచ్చియాడు. సాయి విధ్వంసంతో భారీ స్కోర్‌కు పునాది వేయగా షేక్ రషీద్(53 నాటౌట్), ధ్రువ్ జురెల్(68 నాటౌట్)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు. ఫలితంగా తొలిరోజు భారత ఏ జట్టు 4 వికెట్ల నష్టానికి 333 పరుగులుచేసింది.
శ్రీలంక పర్యటనలో భారత ఏ జట్టు బ్యాటర్లు దంచేస్తున్నారు. ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ ఊచకోతను మరువక ముందే సాయి సుదర్శన్(132) శతకంతో శ్రీలంక ఏ బౌలర్లను వణికించాడు. గాలే స్టేడియంలో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టులో సుదర్శన్ ధనాధన్ ఆటతో రెచ్చిపోయాడు. ఓపెనర్ ఆయుష్ పాండే(25)తో కలిసి 92 రన్స్ జోడించిన సాయి.. ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్(12), రుతురాజ్ గైక్వాడ్(22)లతో భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
Stumps on Day 1 ‼️
1⃣3⃣2⃣ from Sai Sudharsan
6⃣8⃣* from Dhruv Jurel
5⃣3⃣* from Shaik RasheedA superb opening day for India A as they finish on 3⃣3⃣3⃣/4 in Galle 🙌#SLAvINDA | 📸 SLC pic.twitter.com/QO7SLuvtYd
— BCCI (@BCCI) June 25, 2026
పడిక్కల్, గైక్వాడ్ త్వరగానే ఔటైనా.. సెంచరీతో భారత ఏ స్కోర్ బోర్డును ఉరికింంచాడు సాయి. ఆరంభం నుంచి విసిగిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను ఎట్టకేలకు చమిక గుణశేఖర(1-50) పెవిలియన్ పంపి లంకకు ఊరటనిచ్చాడు. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్(68 నాటౌట్), షేక్ రషీద్(53 నాటౌట్)లు వికెట్ కాచుకుంటేనే ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. కాస్త కుదురకున్నాక బ్యాట్‌కు పని చెప్పిన ఈ ద్వయం స్కోర్ మూడొందలు దాటించింది. జురెల్, రషీద్ అర్థ శతకాలతో అజేయంగా నిలవగా..తొలి రోజే 333 రన్స్‌తో భారత ఏ జట్టు పట్టు బిగించింది. లంక బౌలర్లలో దిలుమ్ సుదీరా రెండు వికెట్లతో రాణించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

