స్టట్గర్ట్ (జర్మనీ): భారత వెటరన్ డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న, గిల్లె (బెల్జియం) ద్వయం.. బోస్ ఓపెన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఈ ఇండో బెల్జియం ద్వయం.. 6-3, 5-7, 11-9తో జాకబ్, వాల్నర్ (జర్మన్) జోడీని ఓడించింది.
మిగిలిన మ్యాచ్‌లలో భారత నెంబర్ వన్ డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ యుకీ బాంబ్రీ, తన అమెరికన్ సహచరుడు రాబర్ట్ గాలొవె బోస్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లోనే పోరాటాన్ని ముగించారు. మరో మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)-రెయిస్ వరెల (మెక్సికో) ద్వయం కూడా రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టింది.