Paris Olympics | పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల, మహిళల 4X400 మీటర్ల రిలే ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో భారత అథ్లెట్లు విఫలమయ్యారు. స్టేట్ డి ఫ్రాన్స్ వేదికగా జరిగిన రిలేలో మహ్మద్ అనాస్, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, రాజేశ్ రమేష్‌తో కూడిన పురుషుల బృందం రౌండ్ 1 రెండో హీట్‌ను 3:00.08 నిమిషాలలో పూర్తిచేసి నాలుగో స్థానంలో నిలిచింది.
మూడో స్థానంలో ఉన్న ఇటలీ 3:00.26 నిమిషాలతో ఫైనల్స్‌కు దూసుకెళ్లడం గమనార్హం. మహిళల విభాగానికొస్తే తెలుగమ్మాయి జ్యోతిక శ్రీదండి, విధ్యా రామ్రాజ్, పూవమ్మ, సుభా వెంకటేషన్ బృందం 3:33.99 నిమిషాలలో పరుగును ముగించి అందరికంటే ఆఖరున 8వ స్థానంలో నిలిచింది. అథ్లెటిక్స్ విభాగంలో భారత్ తరఫున 29 మంది బరిలోకి దిగగా నీరజ్ చోప్రా ఒక్కడే పతకం సాధించాడు.