కొలంబో: ఆసియాకప్‌లో రిజర్వ్ డే రోజున కూడా వర్షం కురుస్తోంది. దీంతో ఇవాళ ప్రారంభం కావాల్సిన ఇండోపాక్(Ind Vs Pak) వన్డే మ్యాచ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమదాస స్టేడియం వద్ద స్వల్ప స్థాయిలో ముసురు కురుస్తోంది. గ్రౌండ్‌పై కవర్స్‌ను అలాగే ఉంచారు. ఆకాశం కూడా మేఘాలతో దట్టంగా ఉంది. అయితే వర్షం ఆగినా.. మ్యాచ్ కొనసాగించేందుకు పిచ్ అనుకూలించే పరిస్థితి కనిపించడం లేదు. మైదానం మొత్తాన్ని కవర్స్‌తో కప్పేశారు. ఆదివారం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్లు రోహిత్, గిల్లు హాఫ్ సెంచరీలు చేసి నిష్క్రమించారు. ప్రస్తుతం కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇవ్వనున్నారు.