Steve Waugh: త్వరలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న దక్షిణాఫ్రికా జట్టు అనామక జట్టును ఎంపిక చేయడంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా ఆగ్రహం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఎ) కు టెస్టు క్రికెట్ అంటే పట్టింపులేదని, వాళ్లకు దేశం కంటే ఫ్రాంచైజీ క్రికెట్టే ఎక్కువని, అందుకే అన్క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసిందని అన్నాడు. ఇది న్యూజిలాండ్ క్రికెట్‌ను అవమానించడమేనని, తానే గనక న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అయి ఉంటే ఇప్పటికే ఈ సిరీస్‌ను క్యాన్సిల్ చేసి ఉండేవాడినని తెలిపాడు.
స్టీవ్ వా మాట్లాడుతూ… ‘వాళ్లు (సీఎస్ఎస్) టెస్టుల గురించి పట్టించుకోరు. దక్షిణాఫ్రికా చేసిన ఈ పనివల్ల భవిష్యత్‌లో తమ రెగ్యులర్ ప్లేయర్లను ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు ఆడించుకుంటూ దేశానికి ఆడేవారిని మాత్రం అనామక క్రికెటర్లను పంపించనుందని స్పష్టమవుతున్నది. ఒకవేళ నేనే గనక న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులో ఉండి ఉంటే అసలు ఈ సిరీస్ ఆడకపోయేవాన్ని.. న్యూజిలాండ్ క్రికెట్‌ను ఇది అవమానించడమే..’ అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే కాదని, పలు దేశాలు ఇదే రీతిన వ్యవహరిస్తున్నాయని స్టీవ్ వా అన్నాడు. గతేడాది తమ దేశ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ కూడా పూర్తిస్థాయి జట్టును పంపలేదని స్టీవ్ వా అన్నాడు. వెస్టిండీస్ చాలాకాలంగా పూర్తిస్థాయి జట్టుతో ఆడటం లేదని, ఇది టెస్టు క్రికెట్‌కు ప్రమాదకరమని స్టీవ్ వా ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా కివీస్ పర్యటనకు గాను దక్షిణాఫ్రికా ఇటీవలే ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో కెప్టెన్‌తో పాటు ఏడుగురు క్రికెటర్లు అన్క్యాప్డ్ ప్లేయర్లే కావడం గమనార్హం.
“If I was New Zealand I wouldn’t even play the series. I don’t know why they’re even playing. Why would you when it shows a lack of respect for New Zealand cricket” – Steve Waugh on SA sending inexperienced to NZ Tests #NZvsSA #SA20 pic.twitter.com/ZKcTHWKFKk
— Ragav 𝕏 (@ragav_x) January 1, 2024
కివీస్ పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు: నీల్ బ్రాండ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, రూన్ డి స్వార్డ్ట్, క్లైయిడ్ ఫార్ట్యూన్, జుబేర్ హంజా, షెపో మోర్కీ, మిహ్లాలి ఎంపగ్వానా, ఒలీవర్, డేన్ పీటర్సన్, కీగన్ పీటర్సన్, డేన్ పీడ్ట్, రేనార్డ్ వాన్ టాండర్, షాన్ వోన్ బెర్గ్, ఖాయా జొండొ