బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ఫీల్డర్ స్టీవ్ స్మిత్(Steve Smith) స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా స్లిప్స్‌లో అందుకున్నాడు. బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడవ టెస్టు నాలుగవ రోజు.. స్మిత్ తన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. నిజానికి ఇవాళ కమ్మిన్స్ వేసిన ఫస్ట్ బంతికే కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చాడు. అయితే సెకండ్ స్లిప్‌లో ఉన్న స్మిత్.. ఆ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కావడంతో.. అప్రమత్తంగా లేని స్మిత్ ఫీల్డింగ్ వల్ల.. రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
First ball of the day and dropped!#AUSvIND pic.twitter.com/lY8cdsN5Wo
— cricket.com.au (@cricketcomau) December 16, 2024
అయితే ఆ తర్వాత స్పిన్నర్ లియాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ లేట్ కట్ ఆడబోయాడు. బ్యాట్‌కు తగిలిన బంతి స్లిప్స్‌లో ఉన్న స్మిత్‌కు దూరంగా వెళ్లింది. కానీ అలర్ట్‌గా ఉన్న స్మిత్.. ఆ బంతిని తన కుడి వైపు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టేశాడు. ఆ సూపర్ క్యాచ్‌తో రాహుల్ ఇన్నింగ్స్ ఖతమైంది. అతను 139 బంతుల్లో 84 రన్స్ చేసి నిష్క్రమించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు ఉన్నాయి.
WHAT A CATCH FROM STEVE SMITH!
Sweet redemption after dropping KL Rahul on the first ball of the day.#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/d7hHxvAsMd
— cricket.com.au (@cricketcomau) December 17, 2024
ప్రస్తుతం రవీంద్ర జడేజా 41, నితీశ్ కుమార్ రెడ్డి 7 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. వర్షం వల్ల రెండో సెషన్ ఆగిపోయింది. ఇండియా ఆరు వికెట్లకు 161 రన్స్ చేసింది.