అహ్మదాబాద్: టీమిండియాతో గురువారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగి వెళ్లిన రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆఖరి మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం. ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో భాగంగా జరిగిన మూడు టెస్టుల్లో తొలి రెండు మ్యాచ్ల్లో రోహిత్సేన విజయం సాధించగా.. స్మిత్ సారథ్యంలో మూడో టెస్టు ఆడిన ఆసీస్ ఆరేండ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలుపు రుచిచూసింది. దీంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.