అడిలైడ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో.. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో జేసన్ రాయ్‌ను ఔట్ చేశాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా సూపర్-12 స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆడుతోంది. అడిలైడ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకున్నది. అయితే ఇంగ్లండ్ బ్యాటర్లు స్టార్ బౌలింగ్‌కు ఇబ్బందిపడ్డారు. మిడిల్ స్టంప్‌పై స్టార్క్ వేసిన ఇన్‌స్వింగర్‌కు రాయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
STARC!
A trademark inswinger from the big quick! #AUSvENG#PlayOfTheDay | #Dettol pic.twitter.com/94zYtKeNOE
— cricket.com.au (@cricketcomau) November 17, 2022
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 రన్స్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్ మలన్ వన్డేల్లో రెండవ సెంచరీ నమోదు చేశాడు. 128 బంతుల్లో అతను 134 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బట్లర్ 29, విల్లే 34 రన్స్ చేశారు. కమ్మిన్స్, జంపాలు మూడేసి వికెట్లు తీసుకున్నాడు.
288 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఆసీస్ ఓపెనర్లు వార్నర్, హెడ్లు తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వార్నర్ 86, హెడ్ 69 రన్స్ చేశారు. ఇక వన్ డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్మిత్ 80 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి వన్డే గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని నమోదు చేసింది.