లాహోర్ : పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తొలిసారి ప్రవేశపెట్టిన వేలం ప్రక్రియలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భారీ ధరను దక్కించుకున్నాడు. ఈ సీజన్ నుంచి 8 జట్లతో నిర్వహించబోయే ఈ టోర్నీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సియాల్కోట్ స్టాలిన్జ్ స్మిత్‌కు పాకిస్థాన్ కరెన్సీలో 14 కోట్ల (భారత కరెన్సీలో రూ. 4.53 కోట్లు) ధరతో దక్కించుకుంది. గత కొన్నాళ్లుగా టెస్టు, వన్డేలకే పరిమితమైన స్మిత్‌ను ఒక ఫ్రాంచైజీ రికార్డు ధరకు తీసుకోవడం చర్చనీయాంశమైంది.
పాకిస్థానీ యువ ఓపెనర్ సయీమ్ అయూబ్ (రూ. 4.08 కోట్లు) రెండో అత్యుత్తమ ధర దక్కించుకున్నాడు. కాగా ఈ వేలం నుంచి ఆఫ్ఘాన్ క్రికెటర్లు తప్పుకున్నారు. ఇటీవల కాలంలో పాక్, ఆఫ్ఘాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో పలువురు ఆటగాళ్లు వేలం నుంచి ఉపసంహరించుకున్నారు.