న్యూయార్క్: గ్రీస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ స్టెఫనోస్ సిట్సిపాస్ యూఎస్ ఓపెన్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. బుధవారం రాత్రి ఇక్కడి ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సిట్సిపాస్ 6-3, 6-4, 6-7 (4/7), 6-0 తేడాతో అడ్రైన్ మన్నరినో(ఫ్రాన్స్)పై గెలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లోనూ సిట్సిపాస్ ‘టాయ్‌లెట్ బ్రేక్’ మరోసారి వివాదాస్పదమైంది. మూడు, నాలుగు సెట్ల మధ్య అతడు ఎనిమిది నిమిషాల పాటు విరామం తీసుకున్నాడు. యూఎస్ ఓపెన్ మొదటి మ్యాచ్‌లో కూడా అతడు ఇదే విధంగా చేశాడు. తన ఆటపై తీవ్ర ప్రభావం చూపిందని బ్రిటన్ స్టార్ అండీ ముర్రే వాపోయిన విషయం తెలిసిందే. ఇక మహిళల సింగిల్స్‌లో అమెరికా క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్స్ 6-4, 6-2తో తన దేశానికే చెందిన కోకో గాఫ్‌ను చిత్తు చేసి నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఆమె తదుపరి మ్యాచ్‌లో టాప్ సీడ్ నవోమి ఒసాకాతో తలపడనుంది.