Srivalli Rashmika | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండోర్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక రన్నరప్‌గా నిలిచింది.
ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రష్మిక 3-6, 2-6తో రెండో సీడ్ డలైలా జకుసోవిచ్(స్లోవేనియా) చేతిలో ఓటమిపాలైంది. ఇదే టోర్నీలో వైదేహి చౌదరీతో కలిసి రష్మిక డబుల్స్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.