హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఢిల్లీ వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ శివానీ కర్రా కాంస్య పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన బాలికల అండర్-14 విభాగంలో శివానీ 2:36:64సెకన్ల టైమింగ్తో మూడో స్థానంలో నిలిచింది.
శృతి ఛటర్జీ, అనైకా ప్రవీణ్ వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు అండర్-19 బటర్ఫ్లై విభాగం ఫైనల్లో యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్(2:26:59సె) పసిడి పతకం దక్కించుకుంది. జెదాహ్, ఇషా ఘోషల్ వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.