నేరేడ్మెట్: దుబాయ్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన ఉయ్యాల మోహనహర్ష రజత పతకంతో మెరిశాడు. పురుషుల టీ47 విభాగంలో బరిలోకి దిగిన హర్ష 11.26 సెకన్ల టైమింగ్తో రెండో స్థానంలో నిలిచాడు. స్వదేశానికి చేరుకున్న హర్షను బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. గోపీచంద్ మైత్రా అకాడమీలో ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న ఈ యువ పారా అథ్లెట్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వైకల్యాన్ని లెక్కచేయకుండా ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ హర్ష పతకాలు కొల్లగొట్టాలని పేర్కొన్నారు.