హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీల్లో రాష్ట్ర యువ ప్లేయర్ హర్ష కార్తీక్ టైటిళ్ల జోరు కొనసాగుతున్నది. వరల్డ్ టెన్నిస్ టూర్లో భాగంగా ఇథియోపియాలో జరిగిన ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలో కార్తీక టైటిల్ విజేతగా నిలిచింది.
శనివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో కార్తీక 6-4, 6-2తో బ్రూనా లియోటో(బ్రెజిల్)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన కార్తీక..టోర్నీ మొత్తమ్మీద ఒక్క సెట్ కూడా ప్రత్యర్థికి చేజార్చుకోలేదు.