పటియాల:బర్మింగ్‌హామ్ వేదికగా జూలైలో జరిగే ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుస్సాముద్దీన్ ఎంపికయ్యాడు. గురువారం జరిగిన జాతీయ ట్రయల్స్‌లో హుస్సాముద్దీన్ తన పంచ్ పవర్‌కు తిరుగులేదని నిరూపించాడు. పురుషుల 57కిలోల బౌట్లో ఇందూరు బాక్సర్ హుస్సాముద్దీన్ 4-1తో కవీందర్సింగ్ బిస్త్‌ను చిత్తుచేశాడు. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన హుస్సాముద్దీన్ ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించాడు. ఎక్కడా అవకాశమివ్వకుండా పదునైన హుక్స్, జాబ్స్‌తో విరుచుకుపడ్డాడు. దీంతో రిఫరీలు హుస్సామ్ను విజేతగా ప్రకటించారు. మిగతా బౌట్లలో ప్రత్యర్థులను మట్టికరిపించిన అమిత్ పంగల్(51కి), శివ తాపా(63), రోహిత్ తోకాస్(67కి), సుమిత్(75కి), అశిష్‌కుమార్(80కి), సంజీత్(92కి), సాగర్(92+కి) కామన్వెల్త్ గేమ్స్ బెర్తు దక్కించుకున్నారు. వచ్చే వారంలో మహిళా బాక్సర్లకు ట్రయల్స్ నిర్వహించనున్నారు.
అమిత్ (51 కి), హసముద్దీన్ (57 కి), శివ థాప (63.5 కి), రోహిత్(67 కి), సుమిత్ (75 కి), అశిశ్ కుమార్ (80 కి), సంజిత్ (92 కి), సాగర్ (+92 కి).