ఘనంగా సన్మానించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ టౌన్: రాష్ట్ర యువ అథ్లెట్ మహేశ్వరికి తగిన గుర్తింపు లభించింది. ఇటీవల కేరళలో జరిగిన 25వ జాతీయ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్‌లో మహేశ్వరి కాంస్య పతకంతో మెరిసింది. మహిళల 3000 మీటర్ల స్టిపుల్చేజ్ను 10:47:30 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో ‘సీఎం కేసీఆర్ విజన్-పాలమూరు యూనివర్సిటీ గ్రోత్’ అనే అంశంపై ఎక్సెల్ ఇండియా మ్యాగజైన్ సెమినార్ నిర్వహించింది. ఇందులో పీయూ తరఫున మహేశ్వరికి రూ.50వేలు, కోచ్ నాగపురి రమేశ్‌కు రూ.25 వేల చెక్కులను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా వీరిద్దరిని మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, మాజీ చైర్మన్ పాపిరెడ్డి, పీయూ వీసీ లక్ష్మికాంత్ రాథోడ్, రిజిస్ట్రార్ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.