హైదరాబాద్, ఆట ప్రతినిధి: జ్వాల గుత్తా బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా జరిగిన 35వ జాతీయ సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర షట్లర్ తన్విరెడ్డి విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన అండర్-17బాలికల డబుల్స్ ఫైనల్లో తన్విరెడ్డి, రెషికా జోడీ 21-18, 21-15తో గాయత్రి రావత్, మానస రావత్ ద్వయంపై గెలిచి టైటిల్ దక్కించుకుంది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 17వేల పైచిలుకు క్రీడా ప్రాంగణాలను నిర్మించాం. సీఎం కప్ పోటీలను ఘనంగా నిర్వహించాం’ అని అన్నారు.