హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఢిల్లీ వేదికగా జరిగిన ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో రాష్ట్ర పారా ప్యాడ్లర్ నిశా ఇన్నాని పసిడి పతకంతో మెరిసింది. మ హిళల క్లాస్-8 ఫైనల్లో నిశా 8-11, 11-7, 12-10, 11-9తో సవిత(కర్నాటక)పై అద్భుత విజయం సాధించింది.