Weightlifting | భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 31 : రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామం లో ప్రారంభమయ్యాయి. పోటీలను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శృతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. టోర్నమెంట్లో యూత్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో రాణించిన వారిని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు.
రన్నరప్ కార్తీక్ జోడీ
థాయ్‌లాం డ్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి సత్తాచాటాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కార్తీక్, వి శయ జోడీ 7-6(7-5), 4-6, 7-10తో ఆస్ట్రేలియా ద్వయం డెల్ని జేక్, జెస్సీ చేతిలో ఓడింది.