నెల్లికుదురు, నవంబర్ 17: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించిన అండర్ 17, అండర్ 19 బాల, బాలికల 68వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి సెపక్తప్రా పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్-17 బాలుర విభాగంలో కరీంనగర్‌కు ప్రథమ స్థానం దక్కగా రంగారెడ్డి, నిజామాబాద్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి.
అండర్-17 బాలిక విభాగంలో కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్-19 బాల, బాలికల విభాగంలో వరంగల్ ప్రథమ స్థానం సాధించింది. క్రీడల్లో రాణించినవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. సత్యనారాయణ, రాష్ట్ర పరిశీలకులు కృష్ణమూర్తి అన్నారు.