Rugby | మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 30 : రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ అండర్-14 రాష్ట్ర స్థాయి రగ్బీ టోర్నీని ఎస్జీఎఫ్ సెక్రటరీ శారదాబాయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నిరంజన్‌రావుతో కలిసి ఎంఈవో లక్ష్మణ్‌సింగ్ ప్రారంభించారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి 200 మంది బాలబాలికలు పాల్గొని మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. ఈనెల 2వ తేదీ వరకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరగనున్నాయి.