మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 28: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం మొదలైన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పది ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికలు టోర్నీలో సత్తాచాటుతున్నారు.
మొదటి రోజు బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు 18-8తో మెదక్ జట్టుపై శుభారంభం చేయగా.. హైదరాబాద్ 12-10తో ఖమ్మంపై, నల్లగొండ 26-10తో కరీంనగర్‌పై, ఆదిలాబాద్ జట్టు 19-6తో వరంగల్‌పై గెలిచాయి. మరోవైపు బాలుర కేటగిరీలో వరంగల్ 28-20తో ఖమ్మంపై, రంగారెడ్డి 16-14తో కరీంనగర్‌పై, ఆదిలాబాద్ 28-24తో నల్లగొండపై, హైదరాబాద్ 50-30తో ఖమ్మంపై, కరీంనగర్ 36-30తో నిజామాబాద్‌పై గెలిచాయి.