కొత్తపల్లి, డిసెంబర్ 26 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. స్టేడియంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి హాజరైన జట్లు ప్రతిభను చాటుతున్నాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో బాలుర విభాగంలో 34 జట్లు, బాలికల విభాగంలో 34 జట్లు బరిలోకి దిగాయి.