హనుమకొండ చౌరస్తా, జూలై 25: మహబూబాబాద్ జిల్లా అమెచ్యూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోనెక్స్ సన్‌రైజ్ 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి(అండర్-17 ఇయర్స్) బ్యాడ్మింటన్ పోటీలు వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
మూడురోజుల ఈ పోటీల్లో 20 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథులుగా పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు పాల్గొని ప్రారంభించారు.