రోడ్లు లేవు.. వీధి దీపాలు వెలగవు
ఖైరతాబాద్ డివిజన్లోని బస్తీల్లో సమస్యలు తిష్ట వేశాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం మహాభరత్నగర్, బీజేఆర్నగర్, ఇందిరానగర్ల్లో స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి బస్తీబాట చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా బస్తీవాసులు గోవర్ధన్‌రెడ్డికి తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
- బీఆర్ఎస్ బస్తీబాట
- బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి
- సమస్యలు ఏకరువుపెట్టిన స్థానికులు
ఖైరతాబాద్, ఫిబ్రవరి 14 : ఖైరతాబాద్ డివిజన్లోని బస్తీల్లో సమస్యలు తిష్ట వేశాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం మహాభరత్నగర్, బీజేఆర్నగర్, ఇందిరానగర్ల్లో స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి బస్తీబాట చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా బస్తీవాసులు గోవర్ధన్‌రెడ్డికి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. బస్తీల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నదని, వీధి దీపాలు వెలుగడం లేదని, సీసీ రోడ్డుకు నోచుకోకుండా ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు.
ఎక్కడికక్కడ రోడ్లు తవ్వి వదిలేయడంతో ప్రజలు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీజేఆర్నగర్ మైదానం పక్కన ట్రాన్స్ఫార్మర్కు రక్షణ లేకపోవడంతో ప్రజలకు ప్రమాదకరంగా మారిందన్నారు. అధికారులు స్పందించి ఆయా సమస్యలపై దృష్టిపెట్టాలని కోరారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గజ్జెల ఆనంద్, అంజన్ కుమార్, కృష్ణ, కుమార్, వినీత్ కుమార్, సురేందర్, అశోక్, చారి, ఉస్మాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

